
సీతానగరం: ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తి మృతి
అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన సీతానగరం మండలం మిర్తిపాడుకు చెందిన ప్రభాకరరావు (28) చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడని హెచ్ సీ శ్రీనివాసరావు తెలిపారు. అవివాహితుడైన ప్రభాకరరావు ఈ నెల 1న ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడన్నారు. కుటుంబ సభ్యులు రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అక్కడ మృతి చెందాడు. మృతుడి సోదరుడు ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు.