దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో యువత కీలక పాత్ర పోషించాలని రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి సూచించారు. రాజానగరంలోని నన్నయ్య విశ్వవిద్యాలయం వద్ద శుక్రవారం నిర్వహించిన యువజన ఉత్సవాలలో ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ కీర్తి ప్రతిష్టలను కాపాడాల్సిన బాధ్యత నేటితరం యువతపై ఉందని అన్నారు. దేశంలో 60 శాతం కంటే ఎక్కువ ఉన్న యువత దేశానికి ఆస్తి అన్నారు.