చిన్నారులను లైంగికంగా వేధిస్తున్న ఉపాధ్యాయుడు
రాజానగరం మండలంలోని నామవరం-ఏ బ్లాక్ లో శుక్రవారం ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలోని ఓ ఉపాధ్యాయుడు చిన్నారులను లైంగికంగా వేధిస్తున్నారని విద్యార్థుల తల్లితండ్రులు ఆరోపించారు. ఈ మేరకు ప్రభుత్వ పాఠశాల వద్ద న్యాయం కోసం వారు నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.