వైసిపి ప్రభుత్వంలో రాష్ట్రం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డా

71చూసినవారు
గత వైసీపీ ప్రభుత్వంలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్, రౌడీయిజం, దొంగతనాలు, దేవాలయాలపై దాడులు, మహిళల మిస్సింగ్ కేసులు పెరిగిపోయి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా రాష్ట్రం మారిందని రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు. గురువారం అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ హయాంలో రాజానగరం నియోజకవర్గాన్ని బ్లేడ్ బ్యాచ్ల అడ్డగా చేసుకుని ప్రజలను భయబ్రాంతులకు చేశారన్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్