కోరుకొండ: నరసన్న కొండకు కార్తీక దీపోత్సవం
కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కొండమెట్లకు కార్తీక మాసం సందర్భంగా దీపోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. కొండ దిగువ గల స్వామి వారి పాదాల వద్ద అర్చక స్వాములు తోట పవన్ కుమార్, ప్రత్యూష దేవి చేత ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోను, సుమారు 650 మెట్లుకు ఇరువైపులా కొండ శిఖరం వరకు దీపాలను వెలిగించారు. అర్చకస్వాములు కార్తీక మాస విశిష్టతను వివరించారు.