రాజానగరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొన్ని రోజుల నుంచి తిరుమల లడ్డూ ప్రసాద వివాదంపై నిజానిజాలు నిరూపించకుండా నిందలు మోపరాదని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై వంద రోజులు పూర్తవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని ఆరోపించారు.