దేశ ఆర్థిక ప్రగతిలో కీలకపాత్ర పర్యాటక రంగానిదే అని కలెక్టర్ ప్రశాంతి అన్నారు. శుక్రవారం రాజానగరంలోని నన్నయ్య యూనివర్సిటీ ఆవరణలో ఉన్న ఎన్టీఆర్ కన్వెన్షన్ హాల్ వద్ద నిర్వహించిన పర్యాటక దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. పర్యాటక రంగం అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పర్యటకశాఖ అధికారులు పాల్గొన్నారు.