Oct 16, 2024, 12:10 IST/నారాయణ్ పేట్
నారాయణ్ పేట్
నారాయణపేట: మనోభావాలు దెబ్బతినేలా పోస్టులు పెడితే చర్యలు
Oct 16, 2024, 12:10 IST
సామాజిక మాధ్యమాల్లో ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని నారాయణపేట ఎస్పీ యోగేష్ గౌతమ్ బుధవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఒక వర్గాన్ని కించపరిచేలా, సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వాట్స్ అప్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టరాదని అన్నారు. సోషల్ మీడియాపై నిరంతరం ఐటి విభాగం పోలీసులు నిఘా పెడతారని అన్నారు.