పసలపూడి లో అక్రమ బియ్యం పట్టివేత
రాయవరం మండలం పసలపూడిలో గురువారం పేదల బియాన్ని అక్రమంగా నిల్వ ఉంచడం వల్ల అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఊరిలోని షెడ్లో టాటా ఏస్ వాహనంలో 65 బ్యాగులలో సుమారు 3,185 కేజీల పి. డి. ఎస్. బియ్యాన్ని గుర్తించారు. అక్రమ నిల్వ కారణంగా, 5,46,419/- రూపాయల విలువైన బియ్యాన్ని సీజ్ చేశారు. 6-ఏ క్రింద కేసు నమోదు చేశారు.