Apr 28, 2024, 16:04 IST/వనపర్తి
వనపర్తి
వనపర్తి జిల్లాలో భారీ మొసలి పట్టివేత
Apr 28, 2024, 16:04 IST
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం బూత్కూరులో వ్యవసాయానికి నీళ్లు కట్టడానికి వెళ్లిన శేఖర్ కు ఆదివారం పొలంలో కనిపించిన మొసలిని చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న జిల్లా స్నేక్ సొసైటీ అధ్యక్షులు కృష్ణ సాగర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 185 కేజీలు ఉన్న దాన్ని బంధించి జూరాల డ్యాంలో వదిలినట్లు కృష్ణ తెలిపారు. వారం క్రితం మొసలి 2 గొర్రె పిల్లలను, ఒక ఆవు దూడను చంపిందని గ్రామస్థులు తెలిపారు.