మండపేట: ఎర్రన్నాయుడు విగ్రహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే
రాయవరంలో మాజీ కేంద్ర మంత్రి కింజారపు ఎర్రన్నాయుడు వర్ధంతి కార్యక్రమాన్ని స్థానిక నాయకులు శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని ఎర్రన్నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు ఎర్రన్నాయుడు చేసిన సేవలను ఎమ్మెల్యేలు కొనియాడారు.