Dec 20, 2024, 01:12 IST/వనపర్తి
వనపర్తి
వనపర్తి: చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వండి: కలెక్టర్
Dec 20, 2024, 01:12 IST
గ్రామీణ క్రీడాకారులకు సీఎం కప్ క్రీడా పోటీల ద్వారా వచ్చిన సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. గురువారం బాలకృష్ణయ్య క్రీడా మైదానంలో జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడా పోటీల ముగింపు సమావేశానికి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జి. చిన్నారెడ్డి తో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ. చదువు ఎంత ముఖ్యమో క్రీడలకు అంతే ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.