రేపు ఆచంట పోలీస్ స్టేషన్ నూతన భవనం ప్రారంభం

68చూసినవారు
రేపు ఆచంట పోలీస్ స్టేషన్ నూతన భవనం ప్రారంభం
ఆచంటలో సోమవారం పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటి వరకు సిద్ధాంతం రోడ్‌లోని  ప్రైవేట్ భవనంలో స్టేషన్ కార్యకలాపాలు నిర్వహించేవారు. ప్రస్తుతం కోడేరు రోడ్ లో శాశ్వత భవనాన్ని నిర్మించారు. ఈ స్టేషన్ ప్రారంభోత్సవానికి డీజీపీ ద్వారకాతిరుమలరావు, మంత్రులు అనిత, నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణలు హాజరుకానున్నారు.