పెనుమంట్ర మండలం బ్రాహ్మణచెరువు గ్రామంలో ఎన్ సీ డీ 3 ఓ సర్వే కార్యక్రమం ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య సిబ్బంది గ్రామంలోని ప్రతీ ఇంటికీ వెళ్లి బ్రెస్ట్, సర్వైకల్ తదితర కాన్సర్ లక్షణాలపై సోమవారం ప్రజలకు అవగాహన కల్పించి వారికి వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం లక్ష్మి, ఆశ సిబ్బంది పాల్గొన్నారు.