పెనుమంట్ర మండలం నెగ్గిపూడి గ్రామంలో శనివారం 104 వాహనం ద్వారా ఫ్యామిలీ డాక్టర్ వైద్య శిబిరంలో భాగంగా శనివారం విస్తృతంగా పరీక్షలు నిర్వహించారు. తొలుత పలువురు గ్రామస్థులకు వైద్య సేవలు అందించిన వైద్య బృందం తరువాత స్థానిక గురుకుల బాలుర పాఠశాలలోనూ అంగన్వాడీ పిల్లలకు వైద్య పరీక్షలు చేశారు. డాక్టర్ చావీర్, హెచ్ ఏ.రామకృష్ణ, ఎంఎల్ హెచ్ పీ సంధ్య, ఏఎన్ఎం మాధవి, ఆశ, అంగన్వాడీలు పాల్గొన్నారు.