ప.గో జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సోమవారం పకృతి వ్యవసాయ ఆర్గానిక్ ఉత్పత్తులు, వనరులు విక్రయ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి సంయుక్తంగా ప్రారంభించారు. తొలి కొనుగోలు దారులుగా జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ కొనుగోలు చేసి స్టాల్ ఏర్పాటు చేసిన రైతులను అభినందించారు.