జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలో స్వర్ణంధ్ర@2047 కార్యక్రమంలో భాగంగా, గ్రామస్తులకు అవగాహన కల్పించేందుకు సోమవారం స్పెషల్ ఆఫీసర్ ప్రభాకర్ రావు, ఇన్‌చార్జ్ ఎండీవో గోపాలకృష్ణ సందర్శించారు. సచివాలయ సిబ్బందితో కలిసి "మన మంచి ప్రభుత్వం" స్టిక్కర్లు ప్రతి ఇంటికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగరాజు, సెక్రటరీ అప్పారావు, రమేష్ పాల్గొన్నారు.