మేడే వేడుకలు ఘనంగా నిర్వహించాలి

70చూసినవారు
మే 1న జరగనున్న 138వ మే డే వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఐఎఫ్టియు ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్రావు కోరారు. ఈ సందర్భంగా శనివారం జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరుతూ. ఏలూరు నగరంలోని ఏపీ బేవరేజ్ హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఎఫ్టు జాతీయ కమిటీ ముద్రించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అలాగే మేడే వేడుకల్లో కార్మికులందరూ భాగస్వాములు కావాలని కోరారు.