జగ్గయ్యపేట నియోజకవర్గం కూటమి అభ్యర్థి శ్రీరాం తాతయ్య, విజయవాడ పార్లమెంటు ఓటమి అభ్యర్థి కేశినేని చిన్ని లను గెలిపించాలని ఎన్టీఆర్ జిల్లా టిడిపి అధ్యక్షులు నెట్టెం రఘురామ్ పిలుపునిచ్చారు. సోమవారం జగ్గయ్యపేట నియోజకవర్గం మాగల్లు గ్రామంలో టిడిపి బిజెపి జనసేన పార్టీల నాయకులతో కలిసి గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో నెట్టెం రఘురామ్ పాల్గొన్నారు.