జగ్గయ్యపేట: తప్పిన పెను ప్రమాదం
జగ్గయ్యపేట నియోజకవర్గంలోని వత్సవాయి మండలం భీమవరం గట్టు సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం సంభవించింది. విజయవాడ - హైదరాబాదు జాతీయ రహదారి భీమవరం టోల్ గేట్ సమీపంలో కారు కాలవలోకి దూసుకు వెళ్ళింది. కారు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళుతుండగా కాలవలోకి దూసుకు వెళ్ళింది. కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం తెలుసుకున్న వత్సవాయి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.