విజయవాడ వరద బాధితులకు కైకలూరు మండల సర్పంచులు చేయూతనందించారు. కైకలూరు మండలం లోని 22 పంచాయితీల సర్పంచ్ లుతమ సొంత నిధులు రూ. 1, 35, 000లను విరాళంగా ప్రకటించారు. మండల సర్పంచుల సంఘ అధ్యక్షుడు బలరామరాజు ఆధ్వర్యంలో స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ కి శుక్రవారం చెక్కు అందజేశారు. సర్పంచులు మేరీ నవరత్న కుమారి తదితరులు పాల్గొన్నారు.