నరసాపురం మండలంలో రేషన్ డీలర్ల సమావేశం మండల రెవెన్యూ కార్యాలయంలో శనివారం తహసీల్దార్ తిలారి రాజేశ్వరి అధ్యక్షతన నిర్వహించారు. రేషన్ డీలర్ల అసోసియేషన్ అధ్యక్షుడు అధికారి వీర వెంకట సత్యనారాయణ నేతృత్వంలో డీలర్లు తమ సమస్యలను స్థానిక రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సివిల్ సప్లయ్ అధికారి వి.వి. సత్యనారాయణ సానుకూలంగా స్పందించినట్లు సంఘ నాయకులు తెలిపారు.