నర్సాపురం మండల న్యాయ సేవాథికారా సంస్థ చైర్మన్, 10వ అధనపు జిల్లా న్యాయమూర్తి పి. విజయదుర్గ స్థానిక పీచుపాలేం రోడ్డులోని కల్యాణి రూరల్ రిహాబిలిటేషన్ ఎడ్యుకేషనల్ సొసైటీని శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా సెంటర్ లోని విద్యార్థులకు కంటి, చెవి ఆర్థోపెడిక్ సమస్యలు ఉన్న వారిని గుర్తించి వారికి త్వరలో స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా లేక జిల్లా వైద్య ఆరోగ్య కేంద్రం వైద్యులు ద్వారా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.