బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యానికి మనమంతా నిరంతరం పాటుపడాలని జిల్లా జాయింటు కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని పూజ్య బాపూజీ విగ్రహానికి కలెక్టర్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటే గాంధీజీ ఆశయానికి అనుగుణంగా దేశాభివృద్ధి సాధ్యం అని స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.