పామర్రు నియోజకవర్గ పమిడిమక్కల మండలంలోని కూడేరు, ఐనపూరు గ్రామల్లో సోమవారం పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు అనిల్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి గడప గడపకూ వెళ్లి ప్రతి ఒక్కరిని మర్యాదపూర్వకంగా కలిసి వారి అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి శాసనసభ్యుడిగా తనను మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్న సింహాద్రి చంద్రశేఖర్ ని గెలిపించాలని కోరారు.