కొయ్యలగూడెంలో మంగళవారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పాల్గొని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈసందర్బంగా బాలరాజు మాట్లాడుతూ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అందించడం వల్లే దేశంలో అన్ని వర్గాల ప్రజలు స్వేచ్ఛ, సమానత్వంతో జీవిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.