పోలవరం ప్రాజెక్టు వద్ద నూతన డయాఫ్రం వాల్ నిర్మాణానికి శనివారం ఉదయం 10: 19 గంటలకు అడుగులు పడ్డాయి. ముందుగా ప్రాజెక్టు ప్రాంతంలో లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. అనంతరం భారీ యంత్రాలకు పూజలు చేశారు. పనులను జర్మనీకి చెందిన బావర్ కంపెనీ ప్రతినిధులు ప్రారంభించగా ఇరిగేషన్ అధికారులు సమీక్షించారు. ఈ నిర్మాణం కోసం ప్లాస్టిక్ కాంక్రీట్-టీ5 మిశ్రమాన్ని వినియోగించనున్నారు.