కొయ్యలగూడెం మండలం ధర్మారావుపేట గ్రామంలో ఆదివారం విషాదం నెలకొంది. స్థానిక చెరువు దగ్గరకు బహిర్భూమికి వెళ్లిన అద్దేపల్లి చందు (16)కొట్రా గగన్ సందేశ్ (12), ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు చెరువులో పడి దుర్మరణం చెందారు. శోకసంద్రంలో మునిగిన తల్లితండ్రులు, కుటుంబ సభ్యులు బర్తడే ఫంక్షన్ నిమిత్తం చుట్టాల ఇంటికి వచ్చి అసువులు బాసిన కొట్రా గగన్, పోస్టుమార్టం చేయడానికి వీలు లేదు అంటు పోలీసులతో గొడవకు దిగారు.