మానవత్వం చాటుకున్న తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులు

61చూసినవారు
మానవత్వం చాటుకున్న తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులు
తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లి శివారు వెల్లమెల్లి పొలాల్లో ఆదివారం ఓ వృద్ధుడు చనిపోయాడు అనుకుని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న రూరల్ ఎస్సై ప్రసాద్, సిబ్బంది ఆ వృద్ధుడు కొన ఊపిరితో ఉండడాన్ని గమనించి బురదలో ఉన్న అతన్ని తీసి స్థానికులతో స్నానం చేయించారు. ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉండడంతో ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. వృద్ధుడు బీహార్ కు చెందిన వాడుగా సమాచారం.

సంబంధిత పోస్ట్