ఉంగుటూరులో అగ్నిప్రమాదం

5588చూసినవారు
ఉంగుటూరులో అగ్నిప్రమాదం
ఉంగుటూరు గ్రామంలో ప్రమాదవశాత్తు గడ్డివాములు కాలి బూడిదైన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు. గ్రామానికి చెందిన రైతులు గ్రామ శివారులో గడ్డివాములు ఏర్పాటు చేసుకున్నారు. అయితే వాటికి ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుంది. దీంతో 3 గడ్డివాములు అగ్నికి ఆహుతయ్యాయి. వెంటనే గమనించిన స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వచ్చి మంటలు అదుపు చేసినట్లు స్థానికులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 50వేలు ఆస్తి నష్టం వాటిల్లింది.

సంబంధిత పోస్ట్