Top 10 viral news 🔥
వైసీపీకి చెక్ పెట్టేలా పవన్ మాస్టర్ ప్లాన్?
వైసీపీకి చెక్ పెట్టేలా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ప్రతిపక్షం లేదనే భావన ప్రజల్లో రానివ్వకుండా నిన్న (సోమవారం) పిఠాపురం పర్యటనలో పోలీసులు, హోంమంత్రి అనిత పనితీరుపై పవన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అధికారం, ప్రతిపక్షం పాత్ర తామే పోషిస్తున్నామని ప్రజలకు చెప్పడానికే పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అప్పుడు వైసీపీ ఉన్నా లేకున్నా పెద్ద ఉపయోగం ఉండదంటున్నారు.