ఉంగుటూరు మండలంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో వృద్ధుడు మృతి చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. కైకరం గ్రామానికి చెందిన జాగారపు నాగేశ్వరరావు అనే వ్యక్తి భీమడోలులోని రాజా హోటల్ లో పని చేస్తున్నాడు. కూతురి ఇంటి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరవ్వడానికి సైకిల్ పై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుమార్తె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.