గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి చెందిన అసిస్టెంట్ లైబ్రరీయన్, స్కోప్ ఫౌండేషన్ చైర్మన్ డా.కొండలరావు సేవలను గుర్తించి సోమవారం జాతీయ సామాజిక సేవ రత్న అవార్డు మహోత్సవాన్ని పీఎన్సీఏ కాలేజీలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యా, సేవా రంగాల్లో కృషి చేసిన డా. కొండలరావును జానుడి ఇంటర్నేషనల్ చైర్మన్ డాక్టర్ నూకతోటి రవికుమార్, పిఎన్సిఏ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ శ్రీగీతారాణి శ్రీనివాస్ సత్కరించారు.