త్రిపురాంతకం: సమస్యలు పరిష్కరించాలని వినతి
ప్రాథమిక వైద్య కేంద్రాల్లో పనిచేస్తున్న 104 సిబ్బంది డిమాండ్లను పరిష్కరించాలని సోమవారం త్రిపురాంతకము ఎంపీడీవో రిబ్కాకు ఆ ఉద్యోగులు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 104 నిర్వహణను ప్రైవేట్ ఏజెన్సీ పరిధిలో కాకుండా ప్రభుత్వమే ద్వారనే నిర్వహించాలని అన్నారు. తమ సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు.