ఎర్రగొండపాలెం: కనుమరుగవుతున్న కోనేరు
కొనేరు అంటే ఎంతో చరిత్ర, పాధాన్యత ఉంటుంది. అలాంటి కోనేరు నేడు చెత్త కుండిలా తయారైంది. ఎర్రగొండపాలెం పట్టణంలోని కాశీవిశ్వేశ్వర దేవాలయం, ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ఉన్న కోనేరే ఇందుకు ఉదాహరణ. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కొనేరు ప్రస్తుతం చెత్తతో నిండింది. ఆ ప్రాంతం నుంచి వచ్చే మురుగు నీరు కూడా అక్కడే పేరుకుపోతోంది. దీంతో ఈ ప్రాంతమంతా దుర్వాసన వెదజల్లుతోంది.