త్రిపురాంతకం మండలంలోని స్థానిక శాఖా గ్రంధాలయంలో గ్రంధపాలకుడు జి. రామాంజి నాయక్ ఆధ్వర్యంలో గురువారం జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కస్తూర్భా పాఠశాల/కళాశాల, కెనడి, వెలాసిటీ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు.