యర్రగొండపాలెంలోని ఆమానిగుడిపాడు ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసుకున్న 70 మంది విద్యార్థులకు ప్రధాన ఉపాధ్యాయుడు కొంత కాలంగా సెలవుపై ఉండడంతో టీసీలు ఇవ్వలేదంటూ ఎక్స్ లో మంత్రి నారా లోకేష్ కు విద్యార్థుల తల్లిదండ్రులు వెలిబుచ్చారు. స్పందించిన లోకేష్ సంబంధిత అధికారులను టీసీలు ఇవ్వాలని ఆదేశించడంతో విద్యార్థులకు మంగళవారం టీసీలు అందించారు. మంత్రికి విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.