AP: క్రీస్తు మార్గాన్ని అనుసరించే క్రైస్తవులందరికీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రేమ పూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. 'ప్రేమ, సద్భావన, శాంతి, క్షమ అనేవి ఏసు క్రీస్తు మానవాళికి అందించిన సుగుణాలు. క్రీస్తుపై నమ్మకం ఉన్న విశ్వాసులందరూ ఈ సుగుణాలను ఆచరించి శాంతి, దాన ధర్మాలకు ఆలంబనగా నిలవాలి. ఈ క్రిస్మస్ మానవాళి జీవితాల్లో ప్రేమ, శాంతి నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని ట్వీట్ చేశారు.