ఏపీలో కొన్ని చోట్ల మొరాయించిన ఈవీఎంలు

81చూసినవారు
ఏపీలో కొన్ని చోట్ల మొరాయించిన ఈవీఎంలు
ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. అద్దంకి నియోజకవర్గం కుర్రవానిపాలెంలో, ఉమ్మడి చిత్తూరు జిల్లా వి.కోట మండలం నర్నేపల్లిలో ఈవీఎంలు పనిచేయక పోవడంతో ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. తిరుపతి జిల్లా నారాయణవనం మండలం పాలమంగళం, వరదయ్య పాలెం పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో వరదయ్య పాలెంలో కొందరు ఓటర్లు ఓటు వేయకుండానే వెనుదిరిగారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్