హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. శనివారం జరిగిన పోలింగ్‌లో సాయంత్రం 5 గంటల సమయానికి 61%పైగా ఓటింగ్ నమోదైందని ఈసీ తెలిపింది. సాయంత్రం 6 గంటల సమయంలో కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల క్యూలు కనిపిస్తున్నాయని, ఓటింగ్ శాతం పెరగనుందని పేర్కొంది. అత్యధికంగా నుహ్‌లో 68.28%, యమునానగర్‌లో 67.93% పల్వాల్‌లో 67.69%, జింద్‌లో 66.02%, సిర్సాలో 65.37% నమోదు కాగా, గురుగ్రామ్‌లో 49.92% మాత్రమే నమోదైనట్లు తెలిపింది.