ఏపీలో ఉద్యోగుల బదిలీల గడువు పొడిగింపు

79చూసినవారు
ఏపీలో ఉద్యోగుల బదిలీల గడువు పొడిగింపు
ఏపీలో ఉద్యోగుల బదిలీలు చేపట్టేందుకు మరో 15 రోజుల పాటు గడువును పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సెప్టెంబర్ 15 వరకు బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సెప్టెంబర్ 16 నుంచి బదిలీలపై మళ్లీ నిషేధం అమల్లోకి వస్తుందని స్పష్టం చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పటికీ చాలా ప్రభుత్వ శాఖలు బదిలీల విధివిధానాల్ని రూపొందించుకోకపోవడంతో గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్