మిరపలో బూడిద తెగులు లెవెల్యుల టారిక అను శిలీంధ్రం ద్వారా వ్యాపిస్తుంది. మొదట మొక్కల కింది ఆకులపై తెల్లటి బూడిద రంగు మచ్చలు ఏర్పడతాయి. క్రమేపీ ఈ మచ్చలు పెద్దవై ఆకు అంతటా వ్యాపించి పైకి కూడా విస్తరిస్తాయి. ఈ తెగులు సోకటం వల్ల పూత విపరీతంగా రాలిపోతాయి. మొక్కల్లో పుష్పించే శక్తి క్షీణిస్తుంది. చల్లని పొడి వాతావరణం ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. దీని నివారణకు నీటిలో కరిగే గంధకం 3 శాతం, కేరాథెన్ 0.1 శాతం మందును పిచికారి చేయాలి.