చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే మన డైట్‌లో ఆకుకూరలు తప్పనిసరి. బచ్చలికూర, సోయా, మెంతికూర, క్యాబేజీ వంటి ఆకుకూరలు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. వేడి ఆహారాలు, ఆకుపచ్చ కూరగాయలు ప్రతి రోజు తీసుకోవడం వల్ల జలుబు, ఇతర ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఉండొచ్చని వివరిస్తున్నారు.