ఏపీలో జోరుగా పొరుగు రాష్ట్రాల మద్యం

83చూసినవారు
ఏపీలో జోరుగా పొరుగు రాష్ట్రాల మద్యం
AP: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నూతన లిక్కర్ పాలసీ ప్రవేశపెట్టిన తర్వాత కూడా పొరుగు రాష్ట్రాల మద్యం ఎక్కువగా వస్తోందట. ఈ ఏడాది నవంబర్ వరకు 1.89 లక్షల లీటర్ల ఇతర రాష్ట్రాల మద్యాన్ని ఎక్సైజ్, పోలీస్ శాఖలు సీజ్ చేశాయి. ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కర్నూలు, తూ.గో, కృష్ణా జిల్లాల్లోకి పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం భారీగా వస్తున్నట్లు సమాచారం. కొన్ని బ్రాండ్ల ధరలు ఎక్కువగా ఉండటమే దీనికి కారణమని తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్