తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తమిళనాడులోని ఊతుకోట నుంచి ద్విచక్ర వాహనంపై పిల్లలతో సత్యవేడు వైపు వెళ్తున్న కుటుంబం పేరడం గ్రామ సమీపంలో ఆగి ఉన్న గ్రావెల్ టిప్పర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.