ఏపీలోని ప్రైవేట్ కళాశాలల్లో బీఈడీ కోర్సులకు ఫీజును ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.9 వేలు ఫీజుగా నిర్ణయిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చేసిన సిఫార్సుల మేరకు ఈ ఫీజులను ఖరారు చేసింది. 2023-26 విద్యా సంవత్సరానికి ఈ ఫీజులు ఉంటాయని పేర్కొంది. రాష్ట్రంలో 16 కళాశాలకు ఈ ఫీజులను నిర్ణయించింది.