ఏపీలో అంగన్‌వాడీలతో కలిపి ఐదు రకాల పాఠశాలలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం తీసుకురాబోతోంది. గత ప్రభుత్వంలోని ఆరురకాల బడులస్థానంలో ఐదింటిని తీసుకువస్తోంది. గత హయాంలో పాఠశాల విద్యలో విధ్వంసం సృష్టించిన జీఓ-117ను రద్దుచేసి, ప్రత్యామ్నాయంగా తీసుకురానున్న విధానంపై విద్యాశాఖ మెమో జారీ చేసింది. దీనిపై ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి సలహాలు తీసుకున్న అనంతరం జీఓ ఇవ్వాలని నిర్ణయించింది.