వాయుగుండం ప్రభావంతో కురిసిన అత్యంత భారీ వర్షాలతో అతలాకుతలమైన ఎన్టీఆర్ జిల్లాను వరద ప్రభావిత జిల్లాగా ప్రభుత్వం ప్రకటించింది. చాలాచోట్ల 30 సెం.మీకు పైగా వర్షపాతం 48 గంటల్లో నమోదైంది. 'అత్యంత భారీ వర్షాల కారణంగా కృష్ణా నది, మున్నేరు, బుడమేరుకు పెద్దఎత్తున వరద ముంచెత్తడంతో ఎన్టీఆర్ జిల్లాలోని అధికశాతం ప్రాంతాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. లక్షల మంది ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం పడింది' అని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా పేర్కొన్నారు.