ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు వార్త అవాస్తవమని ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పష్టం చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు రెండు, మూడు జిల్లాలను రద్దు చేయనున్నారనే ప్రచారంపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది. ఇది పూర్తిగా అవాస్తవమని ట్వీట్ ద్వారా స్పష్టం చేసింది. అయితే ఏపీని 30 జిల్లాలుగా పునర్విభజన చేయనున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే.