ఆన్లైన్ క్లాస్ జరుగుతుండగా ఓ విద్యార్థి మహిళా టీచర్ తో అసభ్యంగా ప్రవర్తించాడు. సదరు విద్యార్థి టీచర్ కు ప్రపోజ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో "మీకు పెళ్లి అయిందా మేడం?" అని విద్యార్థి టీచర్ ను అడగగా, కాలేదని ఆమె సమాధానమిచ్చింది. వెంటనే “ఐ లవ్ యూ మేడమ్. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా?” అని విద్యార్థి అడిగాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందనే సమాచారం లేదు. వీడియో చూసిన నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు.